రేషన్ బియ్యం మాయం కేసులో మరో ముందడుగు..! 1 d ago
AP: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులను పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. మచిలీపట్నం సబ్ జైలు నుంచి A2, A4, A5లను తాలుకా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. న్యాయవాదుల సమక్షంలో సా.5 గంటల వరకు విచారించనున్నారు. ఈ కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ A1గా ఉన్నారు. మంగళవారం, హైకోర్టులో జయసుధ ముందస్తు బెయిల్ పై విచారణ జరగనుంది.